Tuesday, March 31, 2009

దొండకాయ గుత్తి మసాల


కావలసిన పదార్దాలు

దొండకాయలు 500 gm

ఉల్లిపాయలు
ఎండు మిరప కాయలు
జీల కర్ర
మినప పప్పు
ఉప్పు
పసుపు
నూనె

తాయారు చేయు పద్ధతి
  • అడుగు మందంగా ఉన్నా బాణలిలో ఎండు మిరపకాయలు జీల కర్ర మినపప్పులను దోరగా వేయించి మిక్సి లో పొడి చేయండి.
  • దాంట్లోనే ఉప్పు ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బండి మసాల తయారు అవుతుంది.
  • తరువాత దొండకాయలను రెండు వైపుల నాలుగు ముక్కలుగా చీల్చి వాటి మధ్యలో మసాల ముద్దను కూరి ,అడుగు మందం గల గిన్నె ను తీసుకుని నూనె పోసి అది కాగిన తరువాత దొండకాయలను వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి
  • అయితే ఉడుకుతున్నంతసేపు గిన్నె పై మూత పెట్టడం మర్చిపోకండి
మసాల బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాత దించి వడ్డించండి


No comments: