Sunday, July 26, 2009

తందూరి రోటి

కావలసినవి

గోధుమ పిండి : 400గ్రా''

పాలు : ఒక కప్పు

బేకింగ్ పౌడర్ : అర టీ స్పూను

ఉప్పు : తగినంత

నూనె : 50గ్రా''

నీళ్ళు : తగినన్ని

తయారు చేసే పద్ధతి

ముందుగా గోధుమ పిండికి బేకింగ్ పౌడర్ కలిపి,జల్లించి,తగిన ఉప్పును చేర్చండి.

తరవాత పాలు,కొంచెం నీళ్ళు కలిపి చపాతి పిండికంటే కొంచెం పల్చగా కలిపి,దానిలో నూనె కూడా కలిపి పది నిమిషాలు మూత పెట్టి ఉంచండి.

బాగా నానిన పిండిని ముద్దలుగా చేసి ఐదు నిమిషాలు గుడ్డతో కప్పి ఉంచి,ఆతరవాత దళసరి చపాతీలా వత్తాలి.

ఇప్పుడు ఒక దొసెల పెనంను స్టౌమీద పెట్టి,వేడి అయిన తరవాత వత్తిన రొట్టెను వెయ్యాలి.

ఆ రొట్టె అడుగు భాగం కాలిన పెన్నం పై బాగా కాలుతుంది.

ఆ తరవాత పెనాన్ని దాని అడుగు భాగం పైనుండేలా స్టౌపైన మార్చి రొట్టె పై భాగాన్ని కాల్చాలి.

రొట్టె అక్కడక్కడ ఎర్రగా కాలి తందూరి రోటిలా తయారవుతుంది.

No comments: