కావలసిన పదార్ధాలు
టమాటోలు 500 గ్రా
మిరియాలు 15 గ్రా
లవంగాలు 2
పుదినా 1 కట్ట
కొత్తిమీర 1 కట్ట
ఎండు మెంతికూర 20 గ్రా
ఉప్పు తగినంత
నిమ్మకాయ 1/2 చెక్క
చక్కెర 1/2 టీ స్పూన్
తాయారు చేయు పద్ధతి :
టమాటోలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసి ఉంచండి.
వాటికి మూడు గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పును కూడా చేర్చాలి.
ఒక సన్నని బట్టలో మిరియాలు, లవంగాలు, పుదీనా, కొత్తిమీర మరియు ఎండు మెంతికూర వేసి మూటకట్టి టమాటో నీళ్ళలో వదిలి స్టవ్ మీద అరగంట ఉడికించి వడకట్టాలి.
ఈ టమాటో రసానికి చక్కెర, నిమ్మరసం చేర్చి తురిమిన కొత్తిమీరతో అలంకరింఛి వేడి వేడిగా వడ్డించండి.
ఇది జలుబు చేసిన వారికి రుచికరమైన మందులా పనిచేస్తుంది.
No comments:
Post a Comment