Sunday, February 6, 2011

మసాలా టామాటో

కావలసిన పదార్ధాలు

ఎర్రని టమాటోలు ( పెద్దవి) :250 గ్రా
బంగాళదుంపలు :180 గ్రా
ఉల్లిపాయలు :3
వేరుసెనగపప్పు :30 గ్రా
నువ్వులు :25 గ్రా
కారం :1/2 టీ స్పూను
పసుపు చిటికెడు
కరివేపాకు 2 రెబ్బలు
ఆవాలు 5 గ్రా
మంచి నూనె 50 గ్రా
కొత్తిమీర 1 కట్ట
ఉప్పు : తగినంత
నిమ్మకాయ : 1 చెక్క


తాయారు చేయు పద్ధతి :
టమాటోలను శుభ్రంగా కడిగి, కత్తితో టమాటో ముచ్చుకవైపు సన్నగా కోయండి.
ఆ టమాటోలోని రసాన్ని పిండి వేరే ఒక గిన్నెలో ఉంచండి.
తరువాత ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంపలకు నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర కలిపి, రసాన్ని పిండేసిన టమాటో డొప్పలలో జాగ్రత్తగా కూరండి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నునే పోసి, కాగిన తరువాత ఆవాలు వేసి వేగాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడ వేసి ఎర్రగ వేయించాక కారం, పసుపు వేసి అందులో వేయించి ముద్ద నూరిన వేరుసెనగపప్పు, నువ్వుల ముద్దను కూడ చేర్చి మసాలలో వేయించి, అందులో టమాటో రసంను కలిపి, తగినంత ఉప్పు చేర్చితే చిక్కటి గ్రేవీ తాయారు అవుతుంది.
ఇప్పుడు ఈ గ్రెవీలో బంగాళదుంపల మసాలను కూరిన టమాటోలను జాగ్రత్తగా వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించండి. నోరూరించే టమాటో మసాలా సిద్ధం.

No comments: