Sunday, February 6, 2011

టమోటా పులుసు

కావలసినవి

టమోటాలు : 500గ్రా
పచ్చిమిర్చి : 6
ఉల్లిపాయలు: 75 గ్రా
కొత్తిమీర : 2 కట్టలు
పసుపు: చిటికెడు
కరివేపాకు : 1 కట్ట
జీలకర్ర : 5 గ్రా
ఆవాలు: 5 గ్రా
నూనె: 3 టీస్పూన్లు

తయారు చేయు పద్ధతి :
  • టమోటాల పైనున్న ముచ్చుకలని చాకుతో తొలిగించి వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని మూడు గ్లాసుల నీళ్ళు పోసి, స్టవ్ మీద పది నిమిషాల పాటు ఉడికించి, దించి చల్లార్చండి.
  • ఆ తరవాత టమోటాల మీదున్న పొరను తీసేశాక , వాటిని గుజ్జుగా పిండండి
  • తరవాత స్టవ్ మీద ఉన్న గిన్నెలో నూనె పోసి కాచక, ఆవాలు, జీలకర్ర తో పూపు పెట్టి, ఆ తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు వేసి, కొంచెం వేయించి, కరివేపాకు రెబ్బలు వేసి గిన్నెను దించేయండి.
  • ఇప్పుడు ఆ గిన్నెలోని మిశ్రమాన్ని టమోటా గుజ్జులో కలిపి, తగినంత ఉప్పు కలిపాక, పచ్చి మిరపకాయ ముక్కలు కలిపి, కొత్తిమీర చిదిమి, రైస్ తో రసం మాదిరి వడ్డించండి.

No comments: