Saturday, April 18, 2009

అరటి వడలు

కావలసిన పదార్దాలు
పచ్చి అరటికాయలు : 4
నానపెట్టిన సెనగ పప్పు : కప్పు
ఉల్లిపాయలు : 2
కొత్తిమీర : కట్ట
బియ్యం పిండి : 2 టేబుల్ స్పూన్లు
పచ్చి మిర్చి : 4
ఉప్పు : తగినంత
అల్లం : కొద్దిగా
నునే : వేయించడానికి సరిపడా

తాయారు చేసే విధానం

అరటి కాయలను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి తొక్క తిసేయ్యాలి.
చల్లారాక వాటిని మెత్తగా పిసికి పక్కన ఉంచాలి.
నాన పెట్టిన సెనగపప్పు, పచ్చి మిర్చి, అల్లం , అన్ని వేసి నీళ్లు పొయకుండా రుబ్బాలి.
ఈ మిస్రమాన్ని అరటి కాయ ముద్దలొ కలపలి. ఉల్లిపాయ ముక్కలు, బియ్యమ్ పిండి, ఉప్పు, కొత్తిమీర తురుము కూడా కలపాలి.
ఈ ముద్దను గుండ్రముగా లేదా అరచేతిలొ చిన్న వడలుగా చేసి నూనేలొ ఎర్రెగా వేయించి తీయాలి.
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్ తో కలిపి తింటే బాగుంటాయి.

No comments: