కావలసినవి
మినప పప్పు : 100 గ్రా
పెసర పప్పు :100 గ్రా
జీల కర్ర : 20 గ్రా
పెరుగు :500 గ్రా
ఉప్పు : తగినంత
ఆయిల్ : వెయంచడానికి సరిపడ
కారం :5 గ్రా
చాట్ మసాల :5 గ్రా
తాయారు చేసే పద్ధతి
ముందగా మినప పప్పు ,పెసర పప్పులను కలిపి నీళ్ళల్లో 3 గంటల పాటు నాన పెట్టి ,తరువాత ఈ పప్పులను ,జీల కర్రను కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యండి.
గ్రైండ్ చేసిన పిండిని ఒక పళ్ళెం లోకి మార్చండి. తర్వాత తగినంత ఉప్పు కలిపి ఉంచండి.
ఒక బాణలలిలో నూనె పొసి కాగిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగ చెసి నూనె లొ ఎర్రగా వెయించి తీసి, వాటిని చల్లని నీటి లొ వేసి ,నీలు పిండెసి ఒక పళ్ళేం లొ అమర్చండి.
ఇప్పుడు పెరుగును సన్నటి బట్టలో మూటకట్టి గట్టిగా నొక్కి,మెత్తగా చేయండి.
ఈ తర్వాత దానిలో ఉప్పు కలిపి ఫ్రిజ్ లో చల్లగా అయ్యెవరకూ ఉంచి,పైన పళ్ళేం లో అమర్చిన భళ్ళాల మీద పోసి వాటి మీద ఛాట్ మసాలా ,కారంపోడి చల్లి అందించండి
No comments:
Post a Comment