కావలసినవి
బంగాళా దుంపలు
ఉల్లి పాయలు
పచ్చి మిరపకాయలు
పుపు
కారం పొడి
అల్లం వెల్లుల్లి
పెరుగు
గసగసాలు
కొబ్బరి
ఉప్పు
కొత్తి మీర
ఆయిల్
తాయారు చేయు పద్ధతి
చిన్న సైజు బంగాళా దుంపలుని పొట్టు తీసి నూనె లో ఫ్రై చేసి పక్కన ఉంచండి.
తర్వాత అడుగు మందము గల గిన్న లో నూనె పోసి, కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని ఎర్రగా వేయించి,తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పసుపు,కారం కలిపి కొంచెం ఫ్రై చేసాక మంట తగ్గించండి.
ఇప్పుడు అదే గిన్న లో పెరుగు, మెత్తగా నూరిన కొబ్బరి ,గసగసాల ముద్దను,పచ్చి మిరప కాయలను, తరిగిన కొత్తి మీర,తగినంత ఉప్పు కలిపి ఫ్రై చేయండి.తర్వాత ఫ్రై చేసిన బంగాళా దుంపలని కలిపి గిన్న పైన మూత పెట్టి సన్నని మంట మీద 15 నిముషాలు ఉడికించి, దించి పైన కొత్తి మీర చల్లి వడ్డించండి
దీన్ని పరోటా చపాతీలతో ఆరగించవచ్చు.
No comments:
Post a Comment