Saturday, April 18, 2009

కిచిడీ వడ

కావలసిన పదార్దాలు

బియ్యం : 100 గ్రా
పెసర పప్పు : 100 గ్రా
రాగి పిండి : 50 గ్రా
పచ్చి మిర్చి : 4
వెల్లుల్లి : 4 రెబ్బలు
లవంగాలు : 3
కొత్తిమీర : 2 కట్టలు
ఉల్లిపయలు : 2
దనియాల పొడి : టీ స్పూన్
ఉప్పు : తగినంత

తయారు చేసే విదానం

లవంగాలు పొడి చెయాలి.
బియ్యం,పెసర పప్పు కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించి దించి పూర్తిగా చల్లారనివ్వాలి.తారువాత అందులోనే రాగి పిండి తరిగిన పచ్చి మిర్చి,లవంగం పొడి,వెల్లుల్లి ముక్కలు,ఉప్పు,కొత్తిమీర తురుము,ఉల్లి ముక్కలు,దనియాల పొడి అన్ని వేసి కలపాలి.
బాణలిలో నూనె వేసి కాచాలి.
తరువాత ఉడికించిన పప్పు బియ్యం మిశ్రమాన్ని అరచేతిలోనే పలుచని వడలుగా చేసి నూనెలో ఎర్రగా వేయించి తియాలి.
నోరూరించే కిచిడీ వడ రేడి.

No comments: