Saturday, April 18, 2009

బొబ్బర్ల బజ్జీ

కావలసిన పదార్దాలు
బొబ్బర్లు : అరకిలో
ఉల్లిపాయలు : 4
పచ్చి మిర్చి : 7
కొత్తిమీర : 2 కట్టలు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడ

తయారు చేసే విదానం
బొబ్బర్లని 4 గంటలు నాన పెట్టి మెత్తగా పిండిలా రుబ్బి పక్కన పెట్టాలి.
అందులో తరిగిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,కొత్తిమీర కలపాలి.తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి.
వీటిని చిన్నచిన్న ఉండలుగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.
ఇవి టొమాటో చట్నీతో తింటే బాగుంటాయి

No comments: