కావలసిన పదార్దలు
అటుకులు :పావు కిలో
వెరుసెనగ గుళ్ళు : 50 గ్రా
ఉల్లి పాయలు : రెండు
పచ్చి మిరపకాయలు : నాలుగు
జీల కర్ర : పావు టీ స్పూను
ఆవాలు : పావుటీస్పూను
ఉప్పు : తగినంత
పసుపు: చిటెకెడు
నూనె :రెండు టేబుల్ స్పూన్లు
కోత్తిమీర : 2 కట్టలు
దనియాల పొడి :పావుటీస్పూను
జీల కర్ర పొడి : పావుటీస్పూను
చాట్ మసాలా : పావుటీస్పూను
నిమ్మకాయ : ఒకటి
మిరియాల పొడి :అరటీస్పూను
కారమ్ : అరటీస్పూను
సన్నకారప్పూస : 50 గ్రా
తయారు చెయు పద్దతి
అటుకులను కడిగి నీళ్ళు వంపేసి అలాగే 10 నిమిషాలు ఉంచాలి.
ఓ గిన్న లో నూనె వేసి ఆవాలు,జీలకర్రలతో పోపు పెట్టి పసుపు వెయ్యాలి.
తరువాత నాన పెట్టిన అటుకులను వేసి,మూత పెట్టి సన్నని మంట మీద 5 నిమిషాల పాటు దమ్ చెయాలి.
వేరుసెనగలను విడిగా వేయించి ఉంచుకోవాలి.
ఇప్పుడు దించిన అటుకులలొ వేయించిన వేరుసెనగలను,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర తురుము,దనియాల పొడి,జీలకర్రపొడి,చాట్మసాల,ఉప్పు,కారం,మిరియాలపొడి అన్ని వేసి కలపాలి.
ఇందులోనే సన్న కారప్పూస కలిపితే అటుకుల చాట్ రేడి.
No comments:
Post a Comment