Saturday, April 18, 2009

కరాచీ పుణుకులు

కావలసిన పదార్దాలు

ఉప్మా రవ్వ : పావు కిలో
మినప్పిండి : పులిసినది కప్పు
మైదా పిండి : 150 గ్రా
ఉల్లిపాయలు: 4
పచ్చి మిర్చి : 6
కొత్తిమీర : 2 కట్టలు
వన్ట సోడా : చిటికెడు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు చెయు పద్దతి

ఓ గిన్నెలో మినప్పిండి వేసి అందులోనే రవ్వ,మైదా పిండి,వంట సొడా వేసి నేళ్ళు చేర్చి జారుగా కలిపి 3 గంటలపాటు పులియనివ్వాలి.
తరువాత సన్నగా తరిగిన ఉల్లి,పచ్చి మిర్చి ముక్కలు,కొత్తిమీర తురుము,ఉప్పు వేసి కలపాలి.
ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి,ఎర్రగా వేయించి తీయాలి.
వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి.

No comments: