కావలసిన పదార్దాలు
మినపప్పు : 500 గ్రా
ఉల్లిపాయలు : 250 గ్రా
అల్లం :చిన్న ముక్క
పచ్చి మిర్చి : 10
కరివెపాకు : 10 రెబ్బలు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడ
తయారు చెయు పద్దతి
మినపప్పు కడిగి నాన పెట్టండి.గంట తరువత దీనిని గట్టిగా ఉండెలా రుబ్బండి.(అంటే పప్పు పలుకుగా ఉండాలి).తగినంత ఉప్పు కలపండి.
రుబ్బడానికి మునుపు నీళ్ళు ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
ఇప్పుడు తరిగిన అల్లం ముక్కలు,పచ్చి మిర్చి,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు రుబ్బిన పిండిలో కలపండి.
ఈ పిండినీ ముద్దలుగా చేసి తడి చేతి మీద పలుచుగా అద్ది బాణలిలో కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించండి.
నోరూరించే ఉల్లి గారేలు మీ ముందు రెడి.
No comments:
Post a Comment