Saturday, April 18, 2009

గ్రీన్ పలావ్

కావలసినవి
పొడువుగా ఉండే పలావు బియ్యం :కప్పు
ఉల్లిపాయలు :రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద:అరటీస్పూను
పచ్చి మిరపకాయలు : 3
టోమాటోలు :రెండు
పాలకూర:4 కట్టలు
నూనె :2 స్పూన్లు
ఉప్పు : తగినంత

తయారు చెసే పద్దతి

ఉల్లిపాయ,టోమాటోల్ని సన్నని ముక్కలుగా కోయాలి.పాలకూరని కూడ సన్నగా తరగాలి.బియ్యాన్ని కొద్దిగా వేయించి 2 కప్పుల నీళ్ళు పోసి 5 నిమిషాలు కుక్కర్ లొ ఉడికంచాలి.
తరవాత ప్రేషర్ పాన్ లొ నూనె వేసి కాగాక ఉల్లిపాయ, మిరపకాయ ముక్కలను వేసి వేయించాలి.
అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పుకూడ వేసి 2 నిమిషాలు తిప్పాలి.
టొమాటో ముక్కలను కూడ వేసి మరో 5 నిమిషాలు వేయించాక పాలకూర వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి.దీన్ని ఉడికించిన అన్నంలో కలిపి కొత్తిమీర చల్లితే గ్రీన్ పలావ్ సిద్దం.

No comments: