కావలసిన పదార్దాలు
ఉప్మా రవ్వ : 2 కప్పులు
పెరుగు :రెండున్నర కప్పులు
పచ్చి మిరపకాయలు : 3
కొత్తిమీర :ఒక కట్ట
టొమోటో : ఒకటి
పసుపు : చిటికెడు
వంట షొడా : పావు టీస్పూన్
తయారు చెయు పద్దతి
ఉప్మ రవ్వ జల్లించి,ఒక గిన్నేలో పోసి దానికి పెరుగు,పచ్చి మిరపకాయ ముక్కలు,ఉప్పు,పసుపు, వంట షొడాలను కలపాలి.
ఈ మిశ్రమాన్ని నూనె రాసిన చిన్న చిన్న గిన్నెలలో నింపండి.
తరువాత కుక్కరులో కొంచం నిళ్ళు పోసి రవ్వ మిశ్రమాన్ని కలిపిన గిన్నెలను పెట్టి కుక్కరు మూత పెట్టి 10 నిమిషాలపాటు స్టీమ్ లో ఉడికించండి.
డొక్లా సిద్దం అవుతుంది.
ఉడికిన డొక్లాను గిన్నెలోంచి వేరు చేసి వాటిపై తురిమిన కొత్తిమీర,టొమాటొ ముక్కలను చేర్చి పుదీనా చట్నీతో తినండి.
No comments:
Post a Comment