కావలసిన పదార్దాలు
మొక్కజొన్న పొత్తులు : 5
అల్లం : 20 గ్రా
పచ్చి మిరపకాయలు : 5
కరివేపాకు : 1 కట్ట
క్యాప్సికమ్ : 75 గ్రా
ఉల్లిపాయలు : 50 గ్రా
ఉప్పు : తగినంత
రీఫైన్డ్ ఆయిల్ : వేయించడానికి సరిపడ
తయారు చేయు పద్దతి
ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కండెనుంచి వేరు చేయండి.
ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు,పచ్చి మిరపకాయలు,అల్లం వేసి రుబ్బండి.మరీ మెత్తగా కాకుండ కొంచం పలుకుగా రుబ్బండి.
ఇప్పుడు ఇ మొక్కజొన్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు,క్యాప్సికమ్,కరివేపాకు వేసి కలపండి.
దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్దను అరచేతిలో వడలా నొక్కుకొని వేడి నూనెలో ఎర్రగా వేయించండి.
యమ్మి యమ్మి మొక్కజొన్న వడలు ఆరగించండి.
No comments:
Post a Comment