కావలసిన పదార్దాలు
తోటకూర : 10 కట్టలు
సెనగపిండి : 75 గ్రా
అల్లం వెల్లులి : ఒకటున్నర టిస్పూన్
జీలకర్ర : పావు టీస్పూన్
కారం : అర టీస్పూన్
ఉప్పు : తగినంత
పచ్చి మిర్చి : 4
నువ్వులు : 25 గ్రా
కరివేపాకు : 1 కట్ట
ఎండు మిర్చి : 3
ఇంగువ : చిటికెడు
ఆవాలు : పావు టీస్పూన్
కొబ్బరి తురుము : 3 టీస్పూన్లు
మంచి నూనె : వేయించడానికి సరిపడ
తయారు చేయు పద్దతి
లేత తోట కూరను బాగా కడిగి సన్నగ తరగండి.
ఇందులో సెనగపిండి,అల్లంవెల్లులి,ఉప్పు,కారం,జీలకర్ర,పచ్చిమిర్చి ముక్కలు వేసి ముద్దలా కలపండి.
ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేయండి.
ఓ బాణలిలో 50గ్రాముల నూనె పోసి నువ్వులు,ఎండుమిర్చి,కరివేపాకు,ఇంగువ,ఆవాలు వేసి పోపు పెట్టండి.
అందులో ఫ్రై చేసిన ఉండలు వేసి ఓ కప్పు నీళ్ళు పోయండి.
ఆ నీళ్ళు ఆవిరి అయ్యె వరకు గరిటతొ కలుపుతు ఉండండి.అంతే తోట కూర ఉండలు సిద్దం.
వీటి మీద కొబ్బరి తురుము జల్లి వడ్డించండి.
No comments:
Post a Comment