Monday, April 20, 2009

గోధుమ రవ్వ పలావ్

కావలసిన పదార్దాలు
గోధుమ రవ్వ : 2 కప్పులు
పుల్లటి పెరుగు : ఒకటున్నర కప్పు
నీళ్ళు : ఒకటున్నర కప్పు
తురిమిన క్యారెట్ : 3\4 కప్పు
తురిమిన కొబ్బరి : అర కప్పు
తరిగిన ఉల్లిపాయలు : అర కప్పు
అల్లమ్ వెల్లులి ముద్ద : ఒక టీస్పూన్
ఉప్పు : తగినంత


తయారు చేయు పద్దతి

ముందుగా గోధుమ రవ్వను 5 నిమిషాల పాటు బాణలిలో వేయించాలి.
దీనికి పెరుగు,నీరు కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి అర గంట సేపు పక్కన ఉంచండి.
క్యారెట్,అల్లంవెల్లులి ముద్ద,ఉల్లిపాయ ముక్కలు,కొబ్బరి,ఉప్పు కలిపిన రవ్వ మిశ్రమాన్ని కుక్కరులో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి.
పెరుగు చట్నితో కలిపి గోధుమ రవ్వ పలవ్ ను అతిధులకు వడ్డించండి.

No comments: