Monday, April 20, 2009

బీట్ రూట్ వడ

కావలసిన పదార్దాలు
బీట్ రూట్ తురిమినది : 100 గ్రా
సెనగ పప్పు : 500 గ్రా
అల్లం : చిన్న ముక్క
పచ్చి మిర్చి : 6
జీల్లకర్ర : టీ స్పూన్
ఉప్పు : తగినంత
కరివేపాకు : 4 రెబ్బలు
కొత్టిమీర : 1 కట్ట
మంచి నూనె : వేయించడానికి సరిపడ


తయారు చేయు పద్దతి

సెనగ పప్పును అర గంట పాటు నీటిలో నాన పెట్టి ఆ పై మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి.
ఒక గిన్నెలో అల్లమ్ ముద్ద,తురిమిన బీట్ రూట్,సన్నగ తరిగిన పచ్చి మిర్చి,జీలకర్ర,కొత్తిమీర,కరివేపాకు,ఉప్పు,సెనగ పిండిలను కలిపి మిశ్రమం చేయాలి.
బాణలిలో నూనె వేడి అయ్యాక సెనగ పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి అర చేతిలో అద్ది దోరగ వేయించాలి.
బీట్ రూట్ వడ రెడి.

No comments: