కావలసిన పదార్దాలు
బంగాళదుంపలు : 500 గ్రా
ఉప్పు : తగినంత
మంచి నూనె : వేయించడానికి సరిపడ
మిరియాల పొడి : పావు టీ స్పూన్
తయారు చేయు పద్దతి
ముందుగ బంగాళదుంపల పొట్టు తీసి చిప్కట్టర్ తో చిప్స్ తరిగి నీళ్ళల్లో వేసి ఉంచండి.
తరువాత ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి,తరిగి నీళ్ళల్లో వేసి ఉంచిన బంగాళదుంపల చిప్స్ ను వేసి, 5 నిమిషాలు ఉంచి,దించి నీళ్ళు వంచేసి తడి లేకుండ పొడి బట్ట మీదవేసి తుడవండి.
ఇప్పుడు ఒక బణలిలో నూనె పోసి కాగిన తరువాత తుడుచిన బంగాళదుంపల ముక్కల చిప్స్ ను విడివిడిగా వేస్తు ఫ్రై చెస్తే చాలు,కరకరలాడె తెల్లని చిప్స్ రెడి.
వీటి మీద మిరియాల పొడి జల్లి,చల్లారిన తరువాత ఆరగించండి.
వీటిని నిలవ కూడ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment