కావలసిన పదార్దాలు
కంద : 500 గ్రా
ఉప్పు : తగినంత
కారం ; 1 టీస్పూన్
ఆవాలు : పావు టీ స్పూన్
ఇంగువ : చిటికెడు
బెల్లం : చిన్న ముక్క
వేరుసెనగ పప్పు : 25 గ్రా
నువ్వులు : 25 గ్రా
చింతపండు : 25 గ్రా
కరివేపాకు : 1 కట్ట
కొత్తిమీర : 1 కట్ట
రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు
మంచి నూనె : 100 గ్రా
తయారు చేయు పద్దతి
ముందుగా కందను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి,నీటిలో కొంచం ఉప్పు వేసి మెత్తగా ఉడికించి,నీళ్ళు వార్చి దానికి కారం,ఉప్పు,కొత్తిమీర,ఫుడ్ కలర్ కలిపి ఉండలుగా చేయండి.
తరువాత వీటిని మరుగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక గిన్నెలొ నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు,ఇంగువ,కరివెపాకుతో పోపు పెట్టి,వేయించి పొడిచేసిన నువ్వులు,వేరుసెనగ పొడిని వేసి కొంచమ్ కారం కూడ వేసి బాగా వేయించండి.
మసాలా వేగాక,చింతపండు పులుసు పోసి,బాగా మరగనిచ్చాక బెల్లం ముక్క కూడ వేసి గిన్నెను స్టవ్ మీదనుంచి దించి కొఫ్తాతోపాటు,గ్రేవిని కూడా చేర్చి వడ్డించండి.
No comments:
Post a Comment