Saturday, April 18, 2009

వెజిటేబుల్ మెయిలి

కావలసినవి
బంగాళా దుంపలు
క్యారెట్
బీన్సు
పచ్చి బఠానీ
చిక్కుడు కాయలు
ముల్లంగి
ఉల్లిపాయలు
కొబ్బరి
ఉప్పు
వెనిగర్
పసుపు
అల్లం వెల్లుల్లి
పచ్చి మిర్చి
కరివేపాకు
నిమ్మ కాయ
ఆయిల్
తాయారు చేయు పద్దతి

  • కూరగాయలని సుబ్రం చేసి,ముక్కలుగా తరిగి పెట్టండి.ఓ కొబ్బరి చిప్పను కోరి రెండు గ్లాసుల నీరు పోసి పాలు పిండి ,పక్కన పెట్టండి.
  • తరువాత ఒక గిన్న లో నఊనే పోసి స్టవ్మీద కాచిన తర్వాత గిన్న లో అల్లం వెల్లుల్లి ముక్కలని,కరివేపాకు వేసి,అందులోనే ఉల్లిపాయ ,పచ్చి మిరప కయ ముక్కలను వేసి,ఎర్రగా వేయించండి.ఆ తర్వాత ఆ గిన్న లోనే తరిగుంచిన కూరగాయ ముక్కలని వేసి కలిపి, చిటికెడు పసుపు ,ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసి , తగినంత ఉప్పు చేరిచి ఉడికించండి.
  • కూరలు ఉడికి నీరు ఇగిరిపోయిన తర్వాత,మిగిలిన కొబ్బరి పాలు పోసి ,ఇంక కొంచెం సేపు ఉడికించండి.ఉడికించాక మంట మీద నుంచి దించి వెనిగర్ , నిమ్మరసం కలిపి వడ్డించండి

No comments: