Friday, April 24, 2009

బీరకాయ కూట్

కావలసిన పదార్దాలు

బీరకాయలు : ఒక కిలొ
పెసర పప్పు : అర కిలొ
పచ్చి మిర్చి :15
కొబ్బరికాయ : ఒకటి
ఉప్పు :తగినంత
మెంతులు : 2 గ్రా
ఆవాలు : 2 గ్రా
కారం : 10 గ్రా
కరివేపాకు :ఒక కట్ట
నూనె : తగినంత

కొత్తిమీర : ఒక కట్ట
జీర : 2 గ్రా

తయారు చేయు పద్దతి

ముందుగా బీరకాయలు,పచ్చి మిర్చి తరిగి ఉంచుకోవాలి.
కొబ్బరికాయ నుండి కొబ్బరి తురుముకొని ఉంచుకోవాలి.
పెసర పప్పును కడిగి నీరు పోసి సగం ఉడికిన తరువాత తరిగిన బీరకాయలను,
పచ్చి మిర్చిలను,కొబ్బరి కోరును వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి.
దీనిలో సరిపడ ఉప్పు వేసి కలిపి గిన్నెను దించి పక్కన ఉంచుకోవలి.
స్టవ్ మీద చిన్న బాణలిలో నూనె పోసి అందులొ ఆవాలు,మెంతులు,కరివేపాకు,జీరాలతొ పొపు పెట్టి,తర్వాత కారం వేసి అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కలపాలి.
దించెముందు కొంచం కొత్తిమీర చల్లితే బీరకాయ కూట్ అద్భుతముగా ఉంటుంది.

No comments: