కావలసిన పదార్దాలు :
పొడువుగా ఉండే పలావు బియ్యం : కప్పు
ఉల్లి పాయలు : రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద : అర టీ స్పూను
పచ్చి మిరప కాయలు : మూడు
టమాటోలు : రెండు
పాల కూర : నాలుగు కట్టలు
నూనె : రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత
తయారు చేయు పద్దతి
ఉల్లిపాయ, టమాటోలుని సన్నని ముక్కలుగా తరగాలి.
పాల కూర కూడా సన్నగా తరగాలి.
బియ్యాన్ని కొద్దిగా వేయించి రెండు కప్పుల నీళ్ళు పోసి ఐదు నిమిషాలు కుక్కర్ లో ఉడికించాలి.
తరవాత ప్రెషర్ పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద ఉప్పు కూడా వేసి మరో ఐదు నిమిషాలు వేయించాక పాలకూర వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి
దీన్ని ఉడికించిన అన్నంలో కలిపి కొత్తిమీర చల్లితే గ్రీన్ పలావ్ సిద్ధం.
No comments:
Post a Comment