కావలసినవి
పలావు బియ్యం : పావుకేజి.
నూనె : 4 టేబుల్ స్పూన్లు.
సెనగ పప్పు :పావుకేజి.
మొలకొలొచ్చిన పెసలు : పావుకేజి.
ఉల్లిపాయలు :నాలుగు (సన్నగా తరగాలి)
టోమాటోలు :నాలుగు (సన్నగా తరగాలి)
క్యాప్సికమ్ :నాలుగు (సన్నగా తరగాలి)
పచ్చిమిరపకాయలు :ఐదారు
నిమ్మరసం :టేబుల్ స్పూన్లు
ఆవాలు :పావు స్పూన్లు
వెల్లుల్లి :మూడునాలుగు రేకలు
కొత్తిమీర : కట్ట (సన్నగా తరగలి)
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
అరగంటసేపు నానబెట్టిన సెనగపప్పును మొలకెత్తిన పెసలతో కలిపి కుక్కర్ లో కొద్దిగా ఉడికించాలి.
బియ్యం కడిగి ఓ పాత్రలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి.
ఉడికేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి.
నీళ్ళు మరిగి బియ్యం కొద్దిగా ఉడికిన తరవాత దించాలి.
సగం ఉడికిన ఈ అన్నాన్ని రెండు భాగాలుగా చేయాలి.
కోసిన కూరగాయ ముక్కలన్నింటినీ కలిపి అందులో నిమ్మరసం,ఉప్పు కొద్దిగా కొత్తిమీర కూడా కలిపి పక్కన ఉంచాలి.
ఓ బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి,ఆవాలు వేయించాలి.
అవి చిటపటమన్న తరవాత వెల్లుల్లిని చిదిమి వేయాలి.
ఉడికిన సెనగపప్పు పెసల మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు వేయించాలి.
విడిగా ఓ ప్రెషర్ పాన్ తీసుకుని అందులో ముందుగా సగమ్ ఉడికిన అన్నంలో సగభాగాన్ని తీసుకుని అడుగున పరచాలి.
దానిమీద పెసలు,సెనగపప్పు మిశ్రమాన్ని వేయాలి.
తరవాత మిగిలిన సగం అన్నాన్ని కూడా పరచాలి.
చివరగా కూరగాయల మిశ్రమాన్ని మరో పొరలా పేర్చి,మిగిలిన కొత్తిమీర మిశ్రమాన్ని చల్లాలి.
ఇప్పుడీ పాన్ ను స్టవ్ మీద పెట్టి ఓ ఐదు నిమిషాలు సిమ్ లో ఉడికించి తీస్తే పెసరన్నం తయార్!
దీన్ని పెరుగుపచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment