Thursday, July 23, 2009

మెంతి రైస్

కావలసినవి
పలావ్ బియ్యం : పావుకేజి
మెంతికూర : నాలుగు పెద్ద కట్టలు
బచ్చలి లేదా చుక్కకూర : ఒక కట్ట(సన్నగ తరగాలి)
పుదీన : కొద్దిగా(సన్నగ తరగాలి)
నూనె : రెండు గరిటెలు,
వెల్లుల్లి రేకలు : ఎనిమిది
యాలకులు : మూడు
లవంగాలు : ఆరు

దాల్చినచెక్క : రెండు చిన్న ముక్కలు

నల్లమిరియాల పొడి :అర టీస్పూన్లు

పచ్చిమిరపకాయలు : నాలుగు

పసుపు : అర టీ స్పూను
టొమాటోలు :అరకేజి
ఉల్లిపాయలు : నాలుగు
ఉప్పు :తగినంత
కొత్తిమీర : కొద్దిగా
తయారుచేసే విధానం
ఉల్లిపాయలు,మిరపకాయలు,టొమాటోలు సన్నగ తరగలి.
ప్రెషర్ పాన్ లో నూనె వేసి కాగాక,మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయలు,మిరపకయాలు వేసి వేగక టొమటో ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించలి.
అందులో మెంతి ఆకులు,తురిమిన బచ్చలి,పుదీనా,కొత్తిమీర,కడిగిన బియ్యం వేసి బాగా కలపాలి.
సుమారు ఒకటిన్నర కప్పుల నీరు పోసి,ఉప్పు వేసి ఉడికిస్తే మెంతి రైస్ రెడీ!


దీన్ని పెరుగుపచ్చడితో తింటే రుచిగా ఉంటుంది


No comments: